ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 131ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగర పాలకసంస్థ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా చేశారు. పోలీసులు వారిని లోపలికి పోకుండా అడ్డుకున్నారు. సర్కారు, ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
లాక్డౌన్ వల్ల ప్రజలు ఆర్థికంగా చితికిపోయిన సమయంలో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ అంటూ సామాన్యులపై పెనుభారం వేస్తుందని సీపీఐ రాష్ట్ర నాయకులు బాగం హేమంతరావు ఆరోపించారు. వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కేసీఆర్ వైఖరి చెప్పాలి: డీకే అరుణ