ETV Bharat / state

KMM CP: ప్రజల భద్రతకే పెద్దపీట వేస్తాం: సీపీ విష్ణు వారియర్‌ - సైబర్ నేరాలు

ఖమ్మం జిల్లాలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సీపీ విష్ణు వారియర్‌ వెల్లడించారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పోలీసు సిబ్బందికి వ్యతిరేకంగా ఫిర్యాదులు వస్తున్నాయన్న సీపీ.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు. జిల్లాలో నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రతినిధితో సీపీ విష్ణు వారియర్‌ ముఖాముఖి.

khammam cp Vishnu Warrior
సీపీ విష్ణు వారియర్‌
author img

By

Published : Jun 30, 2021, 7:39 PM IST

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రతకే పెద్దపీట వేస్తామని పోలీస్ కమిషనర్ విష్ణు అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే తమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. జిల్లాలో నేరాల అదుపునకు తీసుకుంటోన్న చర్యలు, ప్రస్తుత పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రతినిధి లింగయ్యతో సీపీ విష్ణు వారియర్‌ ముఖాముఖి.

ఈటీవీ: జిల్లాలో నేరాల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?

సీపీ: జిల్లాలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నేరాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. తద్వారా నేర నియత్రణతో పాటు ప్రజల భద్రత సాధ్యపడుతుంది.

ఈటీవీ: సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి కదా.. వీటిని ఎలా అరికడుతున్నారు..?

సీపీ: సైబర్ నేరాలను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం. కమిషనరేట్, సీసీఎస్‌లో సైబర్ సెల్ ఏర్పాటు చేశాం. సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. జిల్లాలో ఈ ఏడాది జరిగిన 115 సైబర్ నేరాలను పరిష్కరించాం. వాటిలో ఏటీఎం, మొబైల్‌లకు సంబంధించిన మోసాలే ఎక్కువగా ఉన్నాయి. ఆన్‌లైన్ ఆటలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. వాటిపై ప్రత్యేక దృష్టి సారించాం.

ఈటీవీ: పోలీసులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు వస్తున్నాయి.. దీనిపై మీ స్పందన?

సీపీ: పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యతిరేకంగా ఫిర్యాదులు వస్తున్నట్లు మా దృష్టికి కూడా వచ్చింది. పోలీసులు చట్టానికి అతీతులేమీ కాదు. ఠాణాల్లో భూ వివాదాల పరిష్కారాలు, సివిల్ తగాదాల్లో తల దూరిస్తే ఉపేక్షించేది లేదు. ఠాణాలకు వచ్చే బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవహరించేలా చూస్తాం. న్యాయం కోసం ఆశ్రయించిన వారికి భరోసా ఇవ్వడంతో పాటు భద్రత కల్పిస్తాం. సెటిల్ మెంట్‌లను సహించబోం.

ఈటీవీ: నకిలీ విత్తనాలపై ఏం చర్యలు తీసుకుంటున్నారు..?

సీపీ: వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. సీజన్ ఆరంభం నుంచే నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఇప్పటి వరకు రూ.7 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నాం. వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులతో సంయుక్త టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. దుకాణాలు, ఔట్ లెట్ కేంద్రాల్లో తనిఖీలు చేపడుతున్నాం.

ఈటీవీ: జిల్లాలో గంజాయి రవాణ జోరుగా సాగుతోందనే మాటలు వినిపిస్తున్నాయి.. దీనిపై మీ స్పందన?

గంజాయి రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. అందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపాం. రవాణాను అడ్డుకునేందుకు నిత్యం వాహన తనిఖీలు, చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిఘా ఉంచాం. జిల్లాలో త్వరలోనే గంజాయి రవాణాను పూర్తిగా అరికడతాం.

ఈటీవీ: ట్రాఫిక్‌ సమస్యలపై పరిష్కారాలేమైనా ఆలోచించారా..?

సీపీ: ఖమ్మం నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపై ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నాం. రహదారుల విస్తరణ, వీధి దీపాల ఏర్పాటు దాదాపుగా పూర్తయింది. లాక్‌డౌన్ అనంతరం ట్రాఫిక్‌ను గాడిలో పెట్టేలా కార్యాచరణ రూపొందించాం. ప్రజల భాగస్వామ్యంతో త్వరలోనే నగరంలో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక బ్లాక్ స్పాట్‌లను ఏర్పాటు చేశాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి.. నివారణకు కృషి చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.

ఈటీవీ: కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?

సీపీ: జిల్లాలో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయడంలో పోలీస్ శాఖ విజయవంతమైంది. ఆంక్షలు, నిబంధనలను ప్రజల కోసమే పెట్టారన్న విషయాన్ని వారు గుర్తించాలి. సడలింపుల తర్వాత కొన్ని ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మరిచిపోతున్నారు. ఈ విషయంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించడం మరువొద్దు.

ప్రజల భద్రతకే పెద్దపీట వేస్తాం..

ఇదీ చదవండి: Revanth Reddy: 'కరోనాను ఎదుర్కోడానికి వ్యాక్సిన్... కేసీఆర్ పోవాలంటే ఎన్నికలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.