ETV Bharat / state

ఈనాడు పేపర్‌ చూడలేదా... షేక్‌హ్యాండ్‌ వద్దు: మంత్రి పువ్వాడ - corona virus status in india

ఖమ్మం జిల్లా వైరాలో పర్యటించిన మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​... ప్రజాప్రతినిధులకు కనీసం కరచాలనం కూడా చేయలేదు. ఎవరి మీదో కోపంతో కాదు... కరోనా వస్తుందని...! కరచాలనం వద్దు... దండమే ముద్దు అంటూ సూచించారు కూడా...!

CORONA EFFECT TO MINISTER PUVVADA AJAY KUMAR

author img

By

Published : Mar 3, 2020, 3:24 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ అలజడి సృష్టిస్తున్న వేళ... గ్రామస్థాయిలోనూ అప్రమత్తత మొదలైంది. "కరచాలనం వద్దు.. దండమే ముద్దు" అంటూ సాక్షాత్తు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌... తన పర్యటన కొనసాగించారు.

ఖమ్మం జిల్లా వైరా పురపాలికలో పట్టణప్రగతి కార్యక్రమానికి వచ్చిన మంత్రి... తొలుత గాంధీచౌక్‌ వద్దకు వచ్చారు. కారులో నుంచి దిగుతున్న సమయంలో ప్రజాప్రతినిధులంతా కరచాలనం చేసేందుకు వచ్చారు. కారులో నుంచి దిగుతూనే మీరంతా "ఈనాడు పేపర్‌ చూడలేదా... షేక్‌హ్యాండ్‌ వద్దు కరోనా వస్తదట" అంటూ చేతులు జోడించుకుని ముందుకు సాగారు. పట్టణంలో పర్యటన అనంతరం పురపాలక కార్యాలయం వద్ద కూడా అదే మంత్రాన్ని అమలు చేశారు. సమావేశంలోనూ కరోనా గురించి ప్రస్తావిస్తూ.. పలు సూచనలు చేశారు.

నేతలకు కరచాలనం చేయకుండానే మంత్రి పర్యటన

ఇదీ చూడండి: కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.