ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే కరోనాని అరికట్టవచ్చని ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజేశ్ గార్గేయ ఖమ్మంలో తెలిపారు. సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైరస్ సోకకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఈ నెల 22న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని రాజేశ్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని పిలుపు ఇచ్చిన జనతా కర్ఫ్యూను జయప్రదం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: 'సంకల్పం, సంయమనంతోనే కరోనాపై విజయం'