పెట్రోల్, డీజిల్ ధరలను రోజుకోలెక్కన పెంచుతున్న కేంద్రం... ప్రజల రక్తాన్ని పీల్చుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినా... కేంద్రం మాత్రం పెంచుకుంటూ పోతోందని భట్టి ఆరోపించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారన్నారు. ఇప్పటికైనా పెరిగిన ధరలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా చర్యలు తప్పవు'