Bhatti Fire on BJP: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశానికి రెండు అద్భుత ఫలాలైన స్వాతంత్య్రం, రాజ్యాంగాన్ని అందించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని సంజీవరెడ్డి భవన్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 75 ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న సీనియర్ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం చేశారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అందించిన రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రతిఒక్కరికి సమాన హక్కులు లభించాయని తెలిపారు. కానీ ప్రస్తుత భాజపా ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దుచేసి తిరిగి మనుధర్మశాస్త్రాన్ని అమలు చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. దీర్ఘదృష్టితో దేశంలో నెలకొల్పిన పరిశ్రమలు, ఇతర అభివృద్ధి రంగాలను ఇప్పటి భాజపా ప్రభుత్వం అమ్ముతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బహుళార్థక ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరందించగా... ఈరోజు తెరాస ప్రభుత్వం కనీసం వారు పండించిన ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో లేదని విమర్శించారు.
రాజ్యాంగాన్ని రద్దుచేసే కుట్రలు జరుగుతున్నాయి. భాజపా ప్రభుత్వం తిరిగి మనుధర్మశాస్త్రాన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ దేశాన్ని కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో పెట్టాలని భాజపా చూస్తుంది. దీర్ఘదృష్టితో దేశంలో నెలకొల్పిన పరిశ్రమలు, ఇతర అభివృద్ధి రంగాలను ఇప్పటి భాజపా ప్రభుత్వం అమ్ముతుంది.- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇదీ చదవండి: MLA Jeevan reddy on BJP and congress :'కేసీఆర్ అంటే స్కీమ్‌ల పార్టీ... భాజపా అంటే స్కామ్‌ల పార్టీ'