ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరిచి ఇతర పార్టీల అభ్యర్థులను ఒత్తిళ్లకు, భయభ్రాంతులకు గురిచేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రే స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఖమ్మం ఎన్నికల కాంగ్రెస్ ఇంఛార్జీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
అధికారపక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాలను బతికించాల్సిన బాధ్యత ప్రజలే తీసుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు. అధికార పక్షానికి ప్రైవేటు సైన్యంలా పనిచేయవద్దని పోలీసులకు నేతలు హితవుపలికారు. తెరాసవ్యతిరేక ఓటును ఒకటి చేసేందుకే సీపీఎం, తెదేపాతో పరస్పర అవగాహనతో ముందుకెళ్తున్నామని నేతలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఈ పరికరంతో 2 నిమిషాల్లోనే కరోనా ఫలితం!