ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరాలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ చర్యల వల్లే ఆర్టీసీ నష్టాల్లో ఉందని.. నష్టం వచ్చినంత మాత్రాన కార్పొరేషన్లు అమ్మేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే దుశ్చర్యను మానుకోవాలన్నారు. కార్మికులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
ఇదీ చూడండి: చర్చలకు పిలిచేవరకూ విధుల్లో చేరేదిలేదు: అశ్వత్థామ రెడ్డి