ETV Bharat / state

'రైతులు ఏమి కౌలుదారులు కాదు...' - రైతు బంధు వార్తలు

రైతుబంధు నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకువచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రైతులు ఏమి కౌలుదారులు కాదంటూ మండిపడ్డారు.

congress-clp-leader-bhatti-vikramarka-on-government
'రైతులు ఏమి కౌలుదారులు కాదు...'
author img

By

Published : May 22, 2020, 12:13 PM IST

ఖమ్మం నగరంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పర్యటించారు. స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి... కరోనా కట్టడికోసం ప్రజలకు హోమియో మందులను అందజేశారు. రైతుబంధు నుంచి తప్పించుకునేందుకే కేసీఆర్ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకువచ్చారని ఆరోపించారు.

'రైతులు ఏమి కౌలుదారులు కాదు...'

ఎన్నికల సమయంలో రైతుబంధు ఇచ్చేందుకు... ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని మరి ఇచ్చారు. కానీ ఈ ఆపత్కాల సమయంలో చెప్పిన పంట వేయకపోతే... రైతుబంధు రాదంటూ హెచ్చరిస్తున్నారు. రైతుబంధు నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది. రైతులు ఏమి కౌలుదారులు కాదు... మీరు చెప్పిన పంట వేయడానికి. అక్కడి పరిస్థితులు, భూమి సారం బట్టి పంటలు వేస్తారు. వారు ఏ పంట వేసినా కొనుగోలు చేయాల్సిన బాధ్యత మీదే. రైతుబంధు ఇవ్వకుంటే చూస్తూ ఊరుకోం.

-సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క

ఇవీ చూడండి: విపత్తులోనూ ఆదుకోని ఈ-నామ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.