ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్‌ అగ్రనేతల రాక - ప్రచార కాక - Congress Campaign in Telangana Assembly Elections

Congress Campaign in Joint Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని మరింత హోరెత్తించేందుకు.. కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. పోలింగ్‌కు కొన్ని రోజులే సమయం ఉండటంతో.. ప్రచార జోరు పెంచేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటనలతో క్షేత్రస్థాయి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు.. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2023, 10:02 AM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్‌ అగ్రనేతల రాక

Congress Campaign in Joint Khammam District : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ (Political Heat in Joint Khammam District ).. ఈసారీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, సంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న పార్టీగా.. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా నేతలు ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై గెలిచి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై.. హస్తం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజీనే మైలేజీగా వాడుకుంటున్న కాంగ్రెస్, ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ అంటూ వినూత్న ప్రచారం

AICC Leaders Campaign in Joint Khammam District : ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు పార్టీ మారినప్పటికీ.. కార్యకర్తలు, ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని నిరూపించాలని కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడంతో పాటు.. ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో ఎన్నికల ప్రచారానికి పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు. 10 నియోజకవర్గాలు చుట్టేసేలా ఇద్దరు ముఖ్య నేతలతో.. రోడ్ షోలు, కార్నర్ సమావేశాలు నిర్వహించనున్నారు.

రేపు పినపాక నియోజకవర్గంలోని మణుగూరుకు రాహుల్ గాంధీకి వస్తున్నారు. ఇందుకోసం అందరి సహకారం తీసుకుంటున్నాం. ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ తర్వాత ఏఐసీసీ నేతల షెడ్యూల్ బట్టి తదుపరి వివరాలు తెలియజేస్తాం. - తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి

Rahul Gandhi Visit Manuguru Tomorrow : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తొలి ఎన్నికల పర్యటన అధికారికంగా ఖరారైంది. పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆరోజు ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 11 గంటలకు మణుగూరు చేరుకుంటారు. గంట పాటు రాహుల్ పర్యటన ఉంటుంది. మిగతా నియోజకవర్గాల్లో ఇద్దరు అగ్రనేతల పర్యటన అధికారికంగా ఖరారు కాకపోయినప్పటికీ.. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలిసింది.

తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు

Telangana Assembly Elections 2023 : ఈనెల 19న ఇల్లెందు నియోజకవర్గంలో రాహుల్ గాంధీ రోడ్ షోలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ నెల 22 లేదా 23న జిల్లాలో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఒకే రోజు అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ప్రియాంక రోడ్ షోలు, కార్నర్ సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.

ఇరువురి రాకతో ఉభయ జిల్లాల్లో ప్రచారం హోరెత్తించేలా.. కాంగ్రెస్ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. రోడ్ షోలు, కార్నర్ సమావేశాలకు భారీగా జనసమీకరణ చేసి సత్తా చాటేలా కసరత్తు చేస్తున్నారు. ఇద్దరు అగ్రనాయకుల పర్యటన ముగిసిన తర్వాత.. మరికొందరు ఏఐసీసీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణపై ఏఐసీసీ బృందాల ఫోకస్‌ - అభ్యర్థులతో సంబంధం లేకుండా తెరవెనుక రాజకీయం

ప్రచారంలో కాంగ్రెస్​ తగ్గేదేలే- ఉచిత హామీలతో ఓటర్లలో ఫుల్​ జోష్​, డైలమాలో బీజేపీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.