ETV Bharat / state

ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికలకు సర్వం సిద్ధం

author img

By

Published : Apr 29, 2021, 9:58 PM IST

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 60 డివిజన్లకు జరుగుతున్న ఎన్నికల కోసం 377 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2,274 సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. ఇక ఈసారి కొవిడ్ ఉద్ధృతి కారణంగా పోలింగ్ ప్రక్రియ రూపురేఖలు మారిపోతున్నాయి.

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

రేపు ఉదయం 7 గంటల నుంచి మొదలయ్యే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. బల్దియా ఎన్నికల్లో మొత్తం 2,88,929 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,39,291 మంది పురుషులు, 1,49,074 మంది మహిళలు, 46 మంది ఇతరులు ఉన్నారు. 60 డివిజన్లలో మొత్తం 251 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 131 మంది మహిళా అభ్యర్థులు కాగా 120 మంది పురుషులు ఉన్నారు. ఎన్నికల కోసం మొత్తం 377 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఒక్కో డివిజన్​లో మూడు నుంచి ఆరు వరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 63 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఐదుగురు చొప్పున సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఓ పోలింగ్ అధికారి, ఒక ఏపీవో, ముగ్గురు పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. మరికొంత మంది అదనపు సిబ్బందిని వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలయ్యేలా పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ దాదాపు 1,700 మంది సిబ్బందితో బంబోబస్తు ఏర్పాటు చేసింది.

కరోనా నిబంధనలతో.. ఎన్నికల నిర్వహణ

కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్నందున ఎన్నికల్లో కరోనా వ్యాప్తి చెందకుండా అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రతీ పోలింగ్ కేంద్రంలో పక్కాగా కొవిడ్ నిబంధనలు కొనసాగేలా చూస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే మొత్తం సిబ్బందికి కొవిడ్ కిట్లు అందిస్తున్నారు. దాదాపు 3 వేల కొవిడ్ కిట్లు అందుబాటులో ఉంచారు. ప్రతీ కేంద్రంలో విధుల్లో పాల్గొనే ఐదుగురు బృందానికి కిట్లు అందిస్తున్నారు. ఆ కిట్లలో ఒక్కొక్కరికి 2 మాస్కులు, ఒక్కో ఫేస్ మాస్కు, 2 జతల హ్యాండ్ గ్లౌజులు, ఒక్కొక్కరికి 100 ఎంఎల్ శానిటైజర్ సీసాలు అందించారు. కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఒక్కో కేంద్రంలో 15 వలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో అదనంగా మాస్కులు సిద్ధంగా ఉంచుతున్నారు. ఓటర్లు తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధనలు విధించారు. పోలింగ్​ కేంద్రాల్లో ఓటర్ల కోసం ఈ సారి మూడు క్యూలైన్లు సిద్ధం చేశారు. మహిళలు, పురుషులకు ఒక్కో వరుస ఏర్పాటు చేశారు. అదనంగా మరో క్యూ లైన్ ఉండేలా చూస్తున్నారు. మూడో క్యూలైన్లో వయోవృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, బాలింతలు ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

బ్యాలెట్​ పద్ధతిలో ఎన్నికలు

2012 సెప్టెంబర్​లో ఖమ్మంకు నగరపాలక హోదా లభించింది. నగరపాలక సంస్థగా ఆవిర్భవించిన తర్వాత తొలి ఎన్నిక 2016 మార్చి 6న జరిగాయి. ఆ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. కానీ ఈసారి కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితుల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఈసారి బల్దియా ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిన జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 752 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎగ్జిట్​ పోల్స్​: మినీపోరులో గెలుపెవరిది?​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.