అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ఏన్కూరులోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు గురువారం పలు పోటీలు నిర్వహించారు. మాతృభాష గొప్పదనాన్ని చాటే విధంగా పోటీలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వ్యాసరచన, చిత్రలేఖనం, చేతిరాత, ఉపన్యాసం వంటి పలు పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు మాతృభాష విశిష్టతను వివరించి ఆకట్టుకున్నారు.