మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు, శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ పేర్కొన్నారు. ఖమ్మంలో నిర్వహించిన మహిళా పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సును ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. మహిళలు స్వశక్తితో నిలబడేందుకు ఇటువంటి సదస్సులు ఎంతో ప్రోత్సాహం అందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్తో పాటు వీ-హబ్ సీఈఓ దీప్తి, ఖమ్మం జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కశ్మీర్లో అంతర్గత యుద్ధానికి పాక్ కుట్ర!