Bhatti Vikramarka padayatra : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి... ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా.... ప్రజలకు ఫలాలు అందటం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని... రాష్ట్రంలో సంపదంతా కొంతమంది చేతుల్లోకి వెళ్లిపోతోందని విమర్శించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లి నుంటి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించారు. తొలుత లక్ష్మీనరసింహ స్వామి గుడిలో కుటుంబ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పూలమాలలు, డప్పు వాద్యాలతో పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర 32 రోజుల్లో... ఐదు మండలాల మీదుగా 506 కిలోమీటర్ల మేర సాగుతుందని భట్టి చెప్పారు.
పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సక్రమంగా లేదని ఆరోపించారు. ప్రజల సమస్యలను ఈ పాదయాత్ర ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మధిర నియోజకవర్గం మాత్రమే కాకుండా అన్ని గ్రామాలను తిరిగి... సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇదీ చదవండి : వారసత్వ కళల రక్షణ, ప్రోత్సహం కోసం హునర్ హాట్ : కిషన్ రెడ్డి