ప్రజలంతా భౌతిక దూరం, స్వీయ నియంత్రణ పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని ప్రధాన వీధిలో దుకాణదారులు, వినియోగదారులు, ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజలూ తగు జాగ్రత్తలు పాటించడమే మేలని భట్టి పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు.