ఏ లక్ష్యాల కోసం రాష్ట్రం ఏర్పడిందో అవి నెరవేరడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం ఊసే లేదని మండిపడ్డారు. ప్రతిపక్షాలను అధికార పార్టీ నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు.
బడుగులు, అణగారిన వర్గాలను ప్రభుత్వం అణచివేస్తోందని భట్టి ధ్వజమెత్తారు. సమాజంలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి నీళ్లు తీసుకెళ్తే.. మరి మన రాష్ట్రం పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలను ఖండిస్తున్నానన్న ఆయన.. సరైన సమయంలో రాష్ట్ర ప్రజలు తెరాసకు బుద్ధి చెబుతారని అన్నారు.
ఇదీచూడండి: 'కేసీఆర్ ఇక యుద్ధమే.. నేను సిద్ధమే.. మరి నువ్వు?'