ETV Bharat / state

చూస్తూ ఊరుకుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెడతారు: భట్టి - ఈటీవీ భారత్​ ప్రతినిధి

ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను ప్రజలు చూస్తూ కూర్చుంటే... చివరికి రాష్ట్రాన్ని కూడా ఏదో ఓ రోజు అమ్మకానికి పెడతారని సీఎం కేసీఆర్​పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన రాష్ట్ర బంద్​ను విజయవంతం చేసి ప్రజాబలాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు.

CLP LEADER BATTI VIKRAMARKA ON TSRTC STATE BANDH
author img

By

Published : Oct 18, 2019, 9:04 PM IST

ఆర్టీసీ ఆస్తుల్ని కొట్టేయాలన్న దుర్మార్గమైన కుట్ర దాగి ఉన్నందునే ప్రభుత్వం చర్చలు జరపడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులే కాకుండా... ప్రభుత్వ ఆస్తులు, సింగరేణి ఆస్తుల్ని కూడా అమ్మేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని భట్టి ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసినా.. కేసీఆర్​లో కదలిక రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చూస్తూ ఊరుకుంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేందుకు కూడా కేసీఆర్ వెనుకాడబోరని ఆక్షేపించారు. పార్టీలకతీతంగా బంద్​లో పాల్గొని కార్మికుల పక్షాన నిలవాలని అన్ని పార్టీలను భట్టి కోరారు. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునేందుకు రేపటి బంద్​తో ప్రజా ఉద్యమం నిర్మిస్తామంటున్న భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్​ ప్రతినిధి లింగయ్య ముఖాముఖి...

చూస్తూ ఊరుకుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెడతారు: భట్టి

ఇవీ చూడండి: ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపండి: హైకోర్టు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.