ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలోని మూడున్నర లక్షల మంది ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని, ఉద్యోగులను కాందీశీకులుగా మార్చే 317 జీవోను తక్షణమే రద్దు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానికత అంశాన్ని కాదని సీనియారిటీ ఆధారంగా పోస్టింగ్‌లు కేటాయించడం హేతుబద్ధంగా లేదన్నారు. స్పౌస్ కేసులనూ పక్కనపెట్టి బదిలీలు జరపడంతో గందరగోళ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. కరోనా మూడో ఉద్ధృతి వస్తుందనే సంకేతాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను దూరప్రాంత జిల్లాలకు బదిలీ చేస్తే ఎలాగని భట్టి ప్రశ్నించారు.
ఇదీ చూడండి: Bandi Sanjay Arrest: బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు