ETV Bharat / state

పోడు రైతులు, అటవీ సిబ్బందికి మధ్య తోపులాట.. మాణిక్యారంలో ఉద్రిక్తత..!

Podu lands issue in Khammam : ఖమ్మం జిల్లా మాణిక్యారం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోడు రైతులు, అటవీ సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. తమ భూములను తమకు ఇచ్చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Podu lands issue in Khammam :
Podu lands issue in Khammam :
author img

By

Published : Nov 21, 2022, 12:02 PM IST

Podu lands issue in Khammam : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాణిక్యారం అటవీ ప్రాంతంలో పోడు రైతులు, అటవీ సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. మండలంలోని ఎర్రబోడుగుడితండా, మాణిక్యారం గ్రామాలకు చెందిన 10 మంది రైతులు సుమారు 30 ఎకరాల పోడు భూమిని సాగు చేసుకుంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం అటవీ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకొని మొక్కలు నాటారు. ఆ భూములకు బదులుగా ప్రత్యామ్నాయంగా మరోచోట భూములు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు.

ఇప్పటి వరకు భూములు కేటాయించకపోవడంతో తమ భూముల్లో అధికారులు నాటిన మొక్కలను తొలగించేందుకు రైతులు వచ్చారు. పలు మొక్కలను నరికేశారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి చేరుకొని రైతులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే రైతులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి.. తోపులాటకు దారితీసింది. అనంతరం మొక్కలు నరికిన 10 మంది రైతులపై అటవీ అధికారులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రైతులను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భూముల వద్దకు వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించారు.

ఇవీ చూడండి..

ఫారెస్ట్​ అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ..

పోడుభూముల విషయంలో మరో ముందడుగు.. గ్రామసభల్లో చర్చ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.