ఖమ్మం జిల్లా మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. తమకు నాసిరకం మిరప నారు సరఫరా చేసిన నర్సరీ యాజమాన్యంపై పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. నాసిరకం నారు వల్ల ఎకరాకు 30 నుంచి 50 వేల రూపాయల వరకు నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నష్టపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు కోరారు. ఖమ్మంపాడు గ్రామంలోని 500 ఎకరాల పంట... నాసిక రకం మిరప నారు వల్ల దిగుబడులు లేకుండా పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. ఫలితంగా రైతులు చాలా నష్టపోయారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: స్మార్ట్ఫోన్ కొనివ్వలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య