ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మడకం భీమా, మడవి ఆండా, మడవి మల్లాలు అనే ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజాపూర్ జిల్లా తిమ్మిరిగూడేనికి చెందిన వీరు గ్రామ రక్షణదళంలో ఉంటూ మావోయిస్టులకు కావాల్సిన సరుకులు, ఇతర సామాగ్రి, సమాచారం చేరవేసేవారని ఏసీపీ వెంకటేష్ తెలిపారు. 15 రోజుల క్రితం మిర్చి కోత కూలీలతో కలిసి ఏన్కూరు మండలం జన్నారం, కోనాయపాలెం గ్రామాలకు వచ్చినట్టు వెల్లడించారు.
ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి కంకర మిల్లుల వద్ద డిటోనేటర్లు, వాటికి ఉపయోగించే తీగలు సేకరించి తమ ప్రాంతానికి చేరవేసేందుకు సిద్ధం చేసుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ కరుణాకర్, ఎస్సై శ్రీకాంత్ తమ సిబ్బందితో తనిఖీలు చేయగా మిర్చి బస్తాలతోపాటు డిటోనేటర్లు, తీగలు కనిపించాయి. వాటిని మావోయిస్టులకు ఇచ్చేందుకు సేకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. భీమా 2017లో పోలీసులు, మావోయిస్టుల ఎదురు కాల్పల్లో పాల్గొన్నట్టు అతడి శరీరంలో ఉన్న బుల్లెట్ గాయాలతో నిర్ధరణ అయింది. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఇదీ చూడండి : సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం