ఖమ్మం జిల్లా తల్లంపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తోన్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో తాండూర్ డిపోకు చెందిన డీలక్స్ బస్సు... హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తోంది. ఏలూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తోంది. తల్లంపాడులోని మూలమలుపు వద్ద రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఏలూరు బస్ డిపో డ్రైవర్ కిరణ్ క్యాబిన్లో ఇరుక్కొని చనిపోయాడు. మరో డ్రైవర్ జంగయ్యతోపాటు మరో ఐదుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో కలిపి సుమారు 80 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: తోట రాముడు... ఇంట్లో కేటీఆర్ శ్రమదానం!