ETV Bharat / state

బహిష్కరించడం కాదు.. దమ్ముంటే నువ్వే రాజీనామా చెయ్​: పువ్వాడ - brs leaders fires on ponguleti

ఖమ్మం జిల్లా బీఆర్​ఎస్​లో రగులుతున్న విమర్శనాస్త్రాలు తారాస్థాయికి చేరుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం బీఆర్​ఎస్​ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్‌లు ఘాటుగా సమాధానమిచ్చారు. వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్‌ అధ్యక్షతన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన నేతలు.. పొంగులేటి తీరుపై తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే తనను పార్టీ నుంచి బహిష్కరించాలని ప్రకటించిన పొంగులేటి.. తనకు తానే రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. పార్టీ బీ-ఫామ్‌తో గెలిచిన వాళ్లను బహిష్కరించామని, ఏ పదవి లేని చెల్లని చీటీ పొంగులేటి అంటూ ఎద్దేవా చేశారు.

puvvada
puvvada
author img

By

Published : Feb 7, 2023, 5:43 PM IST

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. అధికార బీఆర్​ఎస్​ నేతలు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డికి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా మారుతున్నాయి. వారం రోజులుగా ఈ నియోజకవర్గంలో రాజకీయాలు వేడిగా సాగుతున్నాయి. గతంలో వైరా నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన బాణోత్‌ విజయాబాయి పొంగులేటి గూటికి చేరడం, ఆమెనే తన వర్గానికి పొంగులేటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చర్చనీయాశంగా మారింది. సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారనే సాకుతో విజయాబాయి చేరిక సమయంలో పొంగులేటి ఇంటికి వెళ్లిన వైరాకు చెందిన పురపాలక ఛైర్మన్‌ జైపాల్‌, మార్క్​ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌తో పాటు నాలుగు మండలాల నేతలను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ క్రమంలో వైరాలోనే బీఆర్​ఎస్​ జిల్లా నేతలు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తి రేపింది. ఈ సమావేశంలోనే మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పొంగులేటిపై తీవ్ర విమర్శలు చేయడం, సవాళ్లు విసరడం చర్చకు దారితీసింది.

కేసీఆర్‌ను ఎదురించిన వారంతా కాలగర్భంలో కలిశారని.. ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వారికీ అదే గతి పడుతుందని మంత్రి అజయ్‌కుమార్‌ పరోక్షంగా పొంగులేటి తీరును ఖండించారు. డిసెంబర్‌ వరకు కేసీఆర్‌ను పొగిడిన వారే.. నెలరోజుల్లోనే విమర్శలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలన్నారు. దమ్ముంటే తనను పార్టీ నుంచి బహిష్కరించాలని సవాల్‌ విసిరిన పొంగులేటి.. తనంతట తానే రాజీనామా చేసి తిరగాలని జవాబిచ్చారు. ఖమ్మం జిల్లా రాజకీయంగా చైతన్యం కలిగిందని, వ్యక్తులను చూసి తమ వెంట వచ్చే పరిస్థితి లేదన్నారు.

వైరాలో అన్ని పదవులు పొంగులేటి వర్గీయులకే ఇచ్చి ప్రాధాన్యత కల్పించామని.. స్థానిక ఎమ్మెల్యే రాములునాయక్‌ నమ్మి వారికి అవకాశం ఇస్తే ద్రోహం చేశారని ఆరోపించారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారినే బహిష్కరించామని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైరా నియోజవకర్గంలో బీఆర్​ఎస్​ గెలుపు బాధ్యత తనదేనని సభలో పువ్వాడ ప్రకటించారు. శాసనసభ సమావేశాల నుంచి ఆ విషయం చెప్పేందుకు వైరాకు ప్రత్యేకంగా వచ్చానని స్పష్టం చేశారు. తామే పోటుగాళ్లమని తిరుగుతున్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని.. కేసీఆర్‌ నాయకత్వంలో పని చేస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

''కేసీఆర్‌ తయారు చేసిన నాయకులు చాలా పెద్దవాళ్లం అనుకుంటున్నారు. ఒక్కసారి కేసీఆర్‌ చేయి వదిలేస్తే వాళ్ల గతి అధోగతి. ఎన్టీఆర్‌ పెట్టిన టీడీపీ, కేసీఆర్‌ పెట్టిన బీఆర్​ఎస్​ మాత్రమే మనుగడ సాగించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 18 పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. గ్రూపు రాజకీయాలు మంచివి కావు. కేసీఆర్ ఎవరికీ అన్యాయం చేయకుండా అందరికీ పదవులు ఇచ్చారు. వైరా బీఆర్​ఎస్​ బాధ్యత నేను తీసుకుంటున్నాను. బీఆర్​ఎస్​ పార్టీని తక్కువగా అంచనా వేయకండి.'' - మంత్రి పువ్వాడ అజయ్​కుమార్

పొంగులేటిపై వైరా వేదికగా ఎమ్మెల్సీ, బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూధన్‌ ఘాటైన విమర్శలు చేశారు. తనకు ఎలాంటి అన్యాయం జరిగిందో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లేనని, శ్రీనివాస్​రెడ్డి నీచ సంస్కృతి జిల్లా ప్రజలకు తెలుసని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో ఆయన వెన్నుపోటు వల్ల ఎంత మంది నష్టపోయారో నియోజకవర్గాల్లోకి వెళ్లి అడిగితే చెబుతారని అన్నారు.

బహిష్కరించడం కాదు.. దమ్ముంటే నువ్వే రాజీనామా చెయ్​: పువ్వాడ

ఇవీ చూడండి..

పొంగులేటి అనుచరులపై బీఆర్​ఎస్​ బహిష్కరణ వేటు

దమ్ముంటే నన్ను బీఆర్​ఎస్​ నుంచి సస్పెండ్‌ చేయాలి: పొంగులేటి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.