ETV Bharat / state

BRS Election Plan In Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాపై గులాబీ దళపతి కేసీఆర్ నజర్.. పాలేరు నుంచి ఎన్నికల సమరశంఖం - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

BRS Election Plan In Khammam : ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచేందుకు ముమ్మరంగా సమాయత్తమవుతోంది. నోటిఫికేషన్​కు సమయం దగ్గరపడుతున్న వేళ.. మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక గురిపెట్టిన గులాబీ దళపతి కేసీఆర్.. పాలేరు నుంచి ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల వేళ జిల్లాలో నిర్వహించే తొలి బహిరంగ సభకు బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

KCR Election campaign in Khammam 2023
BRS Election Plan In Khammam
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2023, 4:27 PM IST

BRS Election Plan In Khammam ఉమ్మడి ఖమ్మం జిల్లాపై గులాబీ దళపతి కేసీఆర్ నజర్.. పాలేరు నుంచి ఎన్నికల సమరశంఖం

BRS Election Plan In Khammam 2023 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచేందుకు ముమ్మరంగా సమాయత్తమవుతోంది. అభ్యర్థుల ప్రకటన నుంచి ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధి పార్టీల కన్నా ఒక అడుగు ముందున్న అధికార పార్టీ.. ఎన్నికల నోటిఫికేషన్​కు సమయం దగ్గరపడుతున్న వేళ.. మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక గురి పెట్టిన గులాబీ దళపతి కేసీఆర్.. పాలేరు నుంచి ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సన్నద్ధమవుతున్నారు.

KCR Election campaign in Khammam 2023 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన నిరాశజనకమైన ఫలితాలు ఎదుర్కొన్న బీఆర్ఎస్.. మూడోసారి మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కదనరంగంలోకి దూకింది. అయితే.. గత రెండు ఎన్నికల్లో చవిచూసిన ఫలితాలు గులాబీ పార్టీని ఇంకా కలవరపెడుతూనే ఉన్నాయి. దీంతో ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ముఖ్యమంత్రి ప్రత్యేక నజర్ పెట్టారు. ఎన్నికలకు ముందు నుంచే ప్రత్యేక కార్యాచరణతో వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించి ఎన్నికల క్షేత్రంలోకి దూకారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే రంగంలోకి దిగిన పార్టీ అభ్యర్థులు, నేతలు.. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుండటంతో ప్రచారపర్వంలో బీఆర్ఎస్ ముందువరుసలో ఉంది.

CM KCR Election Campaign Vehicle : ఎన్నికలకు కేసీఆర్ ప్రచారరథం సిద్ధం.. హుస్నాబాద్​లో తొలి శంఖారావం

BRS Focus On Khammam Politics 2023 : బహిరంగ సభలతో ప్రచారం ముమ్మరం చేసిన బీఆర్ఎస్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి దఫాలో 5 నియోజకవర్గాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు చేశారు. 27న పాలేరు, నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లందు, 5న కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కూసుమంచి మండలం జీళ్లచెర్వులో ప్రజా దీవెన పేరిట బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించనుంది. పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించే ఈ సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలేరు నేతలు.. సూర్యాపేట-ఖమ్మం రహదారి పక్కన దాదాపు 25 ఎకరాల్లో సభా ఏర్పాట్లు చేస్తున్నారు. పక్కనే ప్రత్యేక హెలీప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి వేలాదిగా జనసమీకరణ చేయనున్నారు.

''మనకు ప్రత్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు. నేను 24 గంటలు ప్రజల్లో ఉంటున్నాను. ఖచ్చితంగా ప్రజలు మేము చేసిన అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేగా గెలిపిస్తారు. షర్మిల ఇక్కడి నుంచి పోటీ చేస్తే గట్టి పోటీ వైఎస్ఆర్​టీపీతో ఉంటుంది కాని కాంగ్రెస్ పార్టీతో ఉండదు. పాలేరులో జరిగే కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు అందరూ హాజరుకావాలి.'' -కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే

BRS Election campaign in Khammam : బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడి నుంచే బరిలోకి దిగడం దాదాపు ఖాయం కావడం, ఇదే నియోజకవర్గం నుంచి వైతేపా అధినేత్రి వైఎస్ షర్మిల బరిలో నిలుస్తానని ప్రకటించడంతో పాలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో.. ఇక్కడి నుంచే ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ పాలేరులోనే తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ మారిన నేతలపై ఇప్పటి వరకూ ఎక్కడా ప్రస్తావన తీసుకుని రాని కేసీఆర్.. పాలేరు సభలో ఈ అంశంపై మాట్లాడతారన్న చర్చ ఉంది.

BRS Assembly Elections Campaign 2023 : ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లని 'మేనిఫెస్టో'.. వ్యూహం మార్చి, ప్రచార స్పీడ్‌ పెంచిన కారు

BRS Launch KCR Bharosa Campaign : 'జనంలోకి 'కేసీఆర్ భరోసా'.. మళ్లీ గెలిస్తే కచ్చితంగా జాబ్‌ క్యాలెండర్‌ అమలు''

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.