ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండలో పాము కాటుకు గురై పదేళ్ల కర్ణకంటి జగదీశ్ మృతిచెందాడు. గ్రామంలోని కర్ణకంటి గోపి, భవానీ దంపతుల కుమారుడు జగదీశ్ సోమవారం రాత్రి తమ పూరిగుడిసెలో నేలపైనే పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో తండ్రి గోపి చేతికి చల్లగా తగలడం వల్ల దూరంగా విరిచి లైట్ వేసి చూడగా పాము కనిపించింది. వెంటనే ఆ పామును చంపేశారు. ఆ తర్వాత నిద్రిస్తున్న కుమారుడికి నోట్లో నుంచి నురగ రావడం వల్ల పాము కాటేసిందని భయపడ్డారు. వెంటనే ఊటుకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. దీనితో కుటుంబంలో విషాదం అలుముకుంది.
ఇవీ చూడండి: మద్యంమత్తులో భవనం పైనుంచి జారిపడి వ్యక్తి మృతి