లాక్డౌన్ వల్ల రక్తం దొరక్క తలసేమియా బాధిత చిన్నారులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. వారికి చేయూతనిచ్చేందుకు ఖమ్మం జిల్లాలోని బొమ్మ విద్యాసంస్థల గ్రూప్ ముందుకొచ్చింది. ఉమ్మడి జిల్లాలో వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు.
సంస్థ ఉద్యోగులు రక్తదానం చేశారు. దాతలు ఇచ్చిన రక్తాన్ని చిన్నారులకు అండగా ఉంటున్న స్వచ్ఛంద ప్రతినిధులకు అందజేశారు. అనంతరం విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మంత్రి పువ్వాడ నిత్యావసరాలను అందజేశారు. కరోనాలో కష్టాల్లో ఉన్న చిన్నారులకు అండగా ఉండటం తమకెంతో సంతోషంగా ఉందన్నారు.
ఇదీ చూడండి: పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు