ETV Bharat / state

గంగుల శ్రీనివాస్​ మృతికి భాజపా నిరసన.. అడ్డుకున్న పోలీసులు - ఖమ్మం భాజపా కార్యాలయం ఎదుట భాజపా నిరసనలు

భాజపా కార్యకర్త గంగుల శ్రీనివాస్​ మృతి పట్ల ఖమ్మం జిల్లాలో నిరసన తెలుపుతున్న ఆ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఆందోళనకారులు సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించారు.

bjp protests against gangula srinivas dead in khammam district
గంగుల శ్రీనివాస్​ మృతికి భాజపా నిరసన.. అడ్డుకున్న పోలీసులు
author img

By

Published : Nov 6, 2020, 2:42 PM IST

ఖమ్మం జిల్లా భాజపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆ పార్టీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతికి నిరసన తెలిపేందుకు కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి బయటికి వచ్చారు. కార్యాలయం ఎదుట వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు.

దీంతో ఆందోళనకారులు.. ముఖ్యమంత్రి కేసీఆర్​ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మం బైపాస్​ వైపుకు వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు యత్నిస్తున్న తమను ప్రభుత్వం అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని భాజపా జిల్లా అధ్యక్షుడు ఆరోపించారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ భూముల్లోని పేదల నివాసాల కూల్చివేత.. ఆందోళనలో బాధితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.