ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆధ్వర్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది.
అందరినీ అరెస్ట్ చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను మరింత కష్టాల్లో నెట్టేందుకే ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చిందని వెంటనే దాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: నవంబరు 3న దుబ్బాక ఉపఎన్నిక