పెట్రోలు, డీజిల్‌పై విధించే వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని ఖమ్మంలో భాజపా నేతలు ధర్నా(BJP leaders demanded reduce VAT on petrol) నిర్వహించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగినా కేంద్రం ప్రభుత్వం... ప్రజల అవసరాల దృష్ట్యా ధరలు తగ్గించిందని ధర్నాచౌక్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో భాజపా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సైతం తగ్గించాలని డిమాండ్ చేశారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలు, డీజిల్‌పై ధరలు పెరిగినప్పటికీ దేశ ప్రజలు ఇబ్బందిపడకుండా ఉండాలనే ఉద్దేశం ప్రధాని మోదీ పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే మేము కూడా తగ్గిస్తామని చెప్పిన మన సీఎం కేసీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు తగ్గించలేదు. అందుకే కేసీఆర్‌పై ఒత్తిడి తేవడానికి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూచనల మేరకు శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. సత్యనారాయణ, భాజపా జిల్లా అధ్యక్షులు
పెట్రోలు, డీజిల్ వినియోగదారులకు దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఊరటనిచ్చాయి. వీటిపై ఎక్సైజ్ సుంకం(Excise duty) తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో.. తామూ సిద్ధమంటూ ముందుకొచ్చి అమ్మకపు పన్ను కుదించుకున్నాయి. దీంతో అక్కడ పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గాయి.తెలంగాణ, ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు మాత్రం కేంద్రం ప్రకటించిన ఎక్సైజ్ సుంకం, దానిపై విధించే వ్యాట్ తగ్గింపునకే పరిమితం కావడంతో ఊరట కొంతమేర మాత్రమే లభించింది. పెట్రో ధరలు ఇప్పటికీ గరిష్ఠంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి, స్థానంలో నిలవగా.. తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.
పెట్రోల్, డీజిల్‌పై ఒక్క రూపాయి కూడా తగ్గించేది లేదని ఇప్పటికే సీఎం కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు. తాము నయా పైసా పెంచలేదని... తగ్గించే ప్రసక్తే లేదని చెప్పారు. పెట్రోల్ ధరలను పెంచిన వాళ్లే తగ్గించాలని డిమాండ్ చేశారు. చమురుపై కేంద్రం విధిస్తున్న సెస్‌ను రద్దు చేయాలని అన్నారు. పెట్రో ధరలను కేంద్రమే అడ్డదారిలో పెంచిందన్న కేసీఆర్.. చమురుపై సెస్ రద్దు చేసేవరకు కేంద్రంపై పోరాడుతామన్నారు. 4 రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్నందునే ఎక్సైజ్ సుంకం తగ్గించినట్టు కేసీఆర్ విమర్శించారు. పెట్రో ధరలు కొండంత పెంచి, పిసరంత తగ్గించారని దుయ్యబట్టారు. కేంద్రం పెంచిన పెట్రోల్ ధరల వల్ల అన్ని వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయని తెలిపారు. అన్ని నిత్యావసరాల ధరలు పెరగటం వల్ల పేద ప్రజల జేబులు చిల్లులు పడుతున్నాయని.. దానికి కారణం కేంద్రమేనని విరుచుకుపడ్డారు. రూ.75కే లీటర్ పెట్రోల్ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: CM KCR on Three Farmers Law : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం... వారికి రూ.3 లక్షల ఆర్థికసాయం