ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాజపా- జనసేన పొత్తు ఖరారైంది. ఇప్పటికే ఇరుపార్టీల మధ్య పలుమార్లు సీట్ల సర్దుబాట్లపై చర్చోపచర్చలు సాగగా.. ఎట్టకేలకు ఆ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. మొత్తం 60 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో 54 స్థానాల్లో భాజపా, 6 స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగేందుకు రెండు పార్టీలూ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
గురువారం నామినేషన్ల ఉపసంహరణ ఉన్నందున జనసేనకు కేటాయించిన డివిజన్లలో భాజపా అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకుంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ వెల్లడించారు. ఈ సారి ఖమ్మం ఖిల్లాపై కాషాయజెండా ఎగురవేయడమే లక్ష్యమని ప్రకటించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 600 మంది ఎస్బీఐ ఉద్యోగులకు కరోనా