పొట్ట చేత పట్టుకొని పని కోసం రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చామని.. లాక్డౌన్ కారణంగా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నామని ఖమ్మంలో ఉంటున్న బిహార్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పారిశ్రామిక ప్రాంతం, గ్రానైట్ ఫ్యాక్టరీలో సుమారు 60 మంది బిహార్ నుంచి వచ్చిన కార్మికులు పని చేస్తున్నారు. కొంతకాలంగా తమ వద్ద ఉన్న డబ్బులు అయిపోయాయని.. తెచ్చుకున్న సరుకులు ఖాళీ అయ్యాయని వారు వాపోయారు.
దాతలు రోజులో ఒక్క సారి భోజనం పెడుతున్నారని మిగిలిన పూటలు తాము పస్తులు ఉంటున్నామంటూ వారి గోడు వెల్లబుచ్చుకున్నారు. ఆకలికి తట్టుకోలేకపోతున్నామని తమకు ఎవరైనా సాయం చేయండంటూ వలస కూలీలు వేడుకుంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని తామని బీహార్‌కు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?