ఖమ్మం జిల్లా మధిరలో దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయాన్ని మహాశివరాత్రి సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఐదురోజులపాటు వైభవంగా జరగనున్నాయి. తొలిరోజు వేడకల్లో భాగంగా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారిని కొలిచారు.
ఇవీ చూడండి: సర్వం శివమయం.. శివాలయాల్లో భక్తజన సందోహం..