ETV Bharat / state

భట్టికి గౌడన్నల ఘనస్వాగతం.. కల్లు రుచిచూసిన సీఎల్పీ నేత - తెలంగాణ వార్తలు

Bhatti Vikramarka Padayatra in Khammam district : ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ముదిగొండ మండలం బాణాపురం నుంచి ప్రారంభమైంది. కాగా మార్గంమధ్యలో కల్లుగీత కార్మికులు భట్టికి ఘన స్వాగతం పలికారు. వారి సమస్యలను ఏకరువు పెట్టారు. అసెంబ్లీలో తమ గొంతు వినిపించాలని విజ్ఞప్తి చేశారు.

Bhatti Vikramarka padayatra
కొనసాగుతున్న భట్టి పాదయాత్ర.
author img

By

Published : Mar 4, 2022, 5:17 PM IST

Bhatti Vikramarka Padayatra in Khammam district : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పీపుల్స్​ మార్చ్​ పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. ముదిగొండ మండలం బాణాపురం నుంచి వల్లభి గ్రామానికి వెళ్తుండగా మార్గంమధ్యలో తాటి వనాల వద్ద కల్లుగీత కార్మికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రోడ్డు పక్కన వారు వేసుకున్న పాకలోకి భట్టిని తీసుకెళ్లారు. గీత కార్మికుల సమస్యల గురించి ఏకరువు పెట్టారు. ప్రభుత్వం తాటిచెట్లు ఎక్కడానికి ఎలక్ట్రానిక్ మోకులు ఇస్తామని చెప్పి... ఇవ్వడం లేదన్నారు. మత్స్య కార్మికులు చేపలు పట్టుకుని అమ్మడానికి టీవీఎస్ వాహనాలు ఇచ్చిందని... తమకు కూడా ఇవ్వాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కల్లు రుచి చూసిన భట్టి..

అర్హులైన సభ్యులందరికీ లైసెన్సులు ఇవ్వడం లేదన్నారు. తాటి చెట్టు పై నుంచి పడి చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఏడాదైనా పరిహారం రావడంలేదని వాపోయారు. తాటి వనాల పెంపకం కోసం సొసైటీలకు కేటాయిస్తామని ప్రకటించినా... మూడు ఎకరాల భూమి కూడా ఇవ్వకపోవడంతో భవిష్యత్తులో తమ వృత్తి మనుగడ లేకుండా పోయే ముప్పు ఉందని వివరించారు.

Bhatti Vikramarka padayatra
కల్లు రుచి చూసిన భట్టి

విచ్చలవిడిగా వైన్స్ దుకాణాలు , ఊరూరా బెల్టుషాపులు రావడం వల్ల కల్లు గిరాకీ దెబ్బతింటుందని చెప్పారు. ప్రజలకు మెడిసిన్ మాదిరిగా ఉపయోగపడే కల్లును దూరం చేయడానికి జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమ కోసం గళం వినిపించాలని గౌడన్నలు సీఎల్పీ నేతకు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను ఏకరువు పెట్టిన తర్వాత గీత కార్మికులు సీఎల్పీ నేతను కల్లు రుచి చూడాలని కోరారు. వారి కోరిక మేరకు భట్టి విక్రమార్క... కల్లు తాగారు.

Bhatti Vikramarka padayatra
గౌడన్నల కోరిక మేరకు కల్లు తాగుతున్న భట్టి

ఇదీ చదవండి: మిషన్​ భగీరథ పేరుతో రూ.50 వేల కోట్లు దోపిడీ చేశారు: భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.