ఆర్టీసీ కార్మికులకు గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కార్మికులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారని ముఖ్యమంత్రిని భట్టి ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలిస్తానని గతంలో కేసీఆరే చెప్పి.. ఇప్పుడు మాటమార్చడం సరికాదన్నారు. నష్టాన్ని పూడ్చటానికి ఆర్టీసీ ఆస్తులను అమ్ముతాననడం న్యాయం కాదని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండిః ప్రజాస్వామ్యంలో ఉద్యమాల అణచివేత దారుణం