ప్రభుత్వం ఆరు సంవత్సరాలుగా గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవస్తంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. జ్వరాలతో బాధపడుతున్న స్థానిక ప్రజలను పరామర్శించారు. ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే లేడని దుయ్యబట్టారు. ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులను నియమించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి : వినోద 'వేణు' గానం మూగబోయింది