ETV Bharat / state

ఖమ్మంలో బసవతారకం-ఇండో అమెరికన్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్‌ నిర్ధారణ శిబిరం - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

ఖమ్మంలో బసవతారకం- ఇండో అమెరికన్ ఆసుపత్రి వైద్యులతో క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించారు. చేతన ఫౌండేషన్, కొంగర భవాని మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

Cancer Diagnosis Camp
క్యాన్సర్ నిర్ధారణ శిబిరం
author img

By

Published : Apr 30, 2022, 10:19 PM IST

ఖమ్మంలో బసవతారకం- ఇండో అమెరికన్ ఆసుపత్రి వైద్యులతో క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ప్రారంభమైంది. చేతన ఫౌండేషన్, కొంగర భవాని మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 7వందల మంది క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష కోసం పేర్లు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికి హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రేపు కూడా వైద్యశిబిరం కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

"క్యాన్సర్ గురించి అవగాహన, నిర్ధారణ శిబిరం జరుగుతుంది. ఈ క్యాన్సర్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, నోటి పూతలు ఉన్నవారికి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తున్నాం. అందులో క్యాన్సర్ లక్షణాలు ఉంటే వారిని హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో చికిత్స అందిస్తాం. రేపు వైద్యశిబిరం కొనసాగుతుంది. ఖమ్మం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి."

- డా.రవిశంకర్‌ బసవతారకం ఆసుపత్రి వైద్యుడు

"ఈ క్యాన్సర్ క్యాంపును గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. నా భార్య క్యాన్సర్ వ్యాధితో మరణించారు. అది దృష్టిలో పెట్టుకొని ఈ క్యాంపు నిర్వహిస్తున్నాం. ముందుగానే ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల వ్యాధిని ముందే నిర్ధారించవచ్చు."

- కొంగర రామచంద్రరావు, నిర్వాహకులు

ఇదీ చదవండి: యాదాద్రి కొండపైకి వాహనాల అనుమతి.. కాకపోతే పార్కింగ్ ఫీజు రూ. 500!

మా ప్రతిపాదనలు ఆమోదించినందుకు ధన్యవాదాలు: సీజేఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.