ETV Bharat / state

వ్యక్తిని ఢీకొట్టిన కారు... బ్యాంక్ మేనేజర్ మృతి - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుదిమల్ల ఎస్​బీఐ బ్యాంక్ మేనేజర్​ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన మేనేజర్​ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

వ్యక్తిని ఢీకొట్టిన కారు... బ్యాంక్ మేనేజర్ మృతి

author img

By

Published : Aug 3, 2020, 1:24 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుదిమల్ల ఎస్​బీఐ బ్యాంకు మేనేజర్ సోయం రాంబాపూజీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. లలితాపురం నుంచి ఇల్లందు వైపు మరో వ్యక్తితో కలిసి సాయంకాలపు నడక చేసి తిరిగి వస్తుండగా ఖమ్మం నుంచి ఇల్లందు వైపు అతి వేగంగా వెళ్తోన్న గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది.

సాయంకాలపు వాకింగ్​ వెళ్లొస్తుండగా...

బాపూజీ పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా మృతి చెందారు. వైజాగ్ ప్రాంతానికి చెందిన బ్యాంక్ మేనేజర్ సుదిమల్ల ఎస్​బీఐలో విధులు నిర్వహిస్తూ అలవాటు ప్రకారం సాయంత్రం పూట వాకింగ్​కు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఇవీ చూడండి : నేను చెప్పినదాంట్లో తప్పులుంటే జైలుకెళ్లేందుకు సిద్ధం : ఎన్‌ఎస్‌యుఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.