ETV Bharat / state

Bandi Sanjay on KCR : 'కేసీఆర్‌ దీక్షల వల్ల తెలంగాణ రాలేదు' - Bandi Sanjay fires on KCR

Bandi Sanjay Fires on CM KCR : నిరుద్యోగుల జీవితాలతో సీఎం ఆడుకుంటున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. 30 లక్షల మంది యువత భవిష్యత్​ను నాశనం చేశారని ఆరోపించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన అన్నదాతలకు ఇంతవరకూ పరిహారం చెల్లించలేదని బండి విమర్శించారు.

BJP Nirudyoga march
BJP Nirudyoga march
author img

By

Published : May 27, 2023, 10:11 PM IST

Updated : May 27, 2023, 10:43 PM IST

BJP Nirudyoga March In Khammam : ఖమ్మంలో బీజేపీ నిరుద్యోగ మార్చ్‌ నిర్వహించింది. జడ్పీ సెంటర్ నుంచి మయూరి సెంటర్ వరకు బండి సంజయ్ ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. ఈ ప్రదర్శనలో పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్​, కాంగ్రెస్‌లను లేపేందుకు కొన్ని పత్రికలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. అయినా బీజేపీ విజయపరంపర ఆగదని ఆయన స్పష్టం చేశారు.

కేసీఆర్‌ అందరినీ మోసం చేశారు : దొంగ దీక్షతో కేసీఆర్‌ అందరినీ మోసం చేశారని బండి సంజయ్‌ విమర్శించారు. ఓయూ విద్యార్థులు తిరగబడటంతో మళ్లీ దీక్షను కొనసాగించారని దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగాలు లేవని.. కానీ కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు ఉన్నాయని ఆరోపించారు. టీఎస్​పీఎస్సీ విషయంలో ఇద్దరే నిందితులని కేటీఆర్ చెప్పారని.. కానీ ఇప్పటి వరకూ 50 మంది దాకా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తప్పు చేయకుంటే ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 30 లక్షల మంది యువత భవిష్యత్​ను నాశనం చేశారని అన్నారు.

టీఎస్​పీఎస్సీపై మాట్లాడినందుకు.. తనను పదోతరగతి ప్రశ్నాపత్రంను లీక్ చేశానని.. అరెస్ట్ చేసి జైలుకు పంపారని బండి సంజయ్ దుయ్యబట్టారు. కానీ తాను భయపడనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఎవ్వరూ సంతోషంగా లేరని ఆరోపించారు. రైతులు రుణమాఫీ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అకాలవర్షాల నష్టపోయిన అన్నదాతలకు ఇస్తానన్న పరిహారంను కేసీఆర్ ఇంతవరకూ ఇవ్వలేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారణం ముఖ్యమంత్రిని బండి సంజయ్ ఆరోపించారు. సింగరేణిని అధోగతిపాలు చేశారని విమర్శించారు. సర్పంచ్​లకు నిధులు కేటాయించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం చేపడుతున్న ఉద్యోగ భర్తీల్లో ఎక్కడా అవినీతి లేదని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాగానే పేదలందరికి ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం జాబ్​ క్యాలెండర్​ను రిలీజ్ చేస్తామని.. దాని ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తామని బండి సంజయ్​ వివరించారు.

"బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను లేపేందుకు కొన్ని పత్రికలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయినా బీజేపీ విజయపరంపర ఆగదు. దొంగ దీక్షతో కేసీఆర్‌ అందరినీ మోసం చేశారు. ఓయూ విద్యార్థులు తిరగబడటంతో మళ్లీ దీక్ష కొనసాగించారు. కేసీఆర్‌ దీక్షల వల్ల తెలంగాణ రాలేదు. యువతకు ఉద్యోగాలు లేవని.. కానీ కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు ఉన్నాయి. సింగరేణిని అధోగతిపాలు చేశారు. సర్పంచ్​లకు నిధులు కేటాయించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రైతులు రుణమాఫీ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

కేసీఆర్‌ దీక్షల వల్ల తెలంగాణ రాలేదు

ఇవీ చదవండి : Bandi Sanjay Fires on CM KCR : 'కేసీఆర్​.. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు'

Bandi Sanjay: KCR కుటుంబానికో న్యాయం.. మంత్రులు, ఎమ్మెల్యేలకో న్యాయమా?

Last Updated : May 27, 2023, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.