సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 8 రోజుల పాప అదృశ్యం కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పాప ఆచూకీ కోసం పోలీసులు నిన్నటి నుంచి సీసీ కెమేరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మంగళవారం సీసీటీవీ పుటేజీలో ఒక మహిళను అనుమానితురాలిగా గుర్తించారు. అయితే పాప అదృశ్యానికి సదురు మహిళకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. ఈ కేసును ఒక ఛాలెంజ్ తీసుకున్నామని.. త్వరలోనే పాప జాడ కనుగొంటామని సంగారెడ్డి పట్టణ సీఐ వెంకటేశ్ అన్నారు.
ఇవీ చూడండి: విద్యార్థుల అవగాహనలేమి... జేఈఈలో వెనుకబాటు