నర్సరీల సక్రమ నిర్వహణతోనే పంటలు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ కోరారు. ఖమ్మంలో ఉద్యాన పంటల నర్సరీల నిర్వహణ, సమగ్రవ్యవసాయంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ పలు సూచనలు చేశారు. మిరప పంట బాగుండాలంటే ముందుగా నర్సరీలు బాగుండాలని, నర్సరీల ప్రక్రియ నిర్వహణ ద్వారానే పంట దిగుబడిలో సత్ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు.
వైరస్ సోకిన నారు విక్రయించకూడదు
ఎండు తెగులు, ఇతర వైరస్‌లను నర్సరీల్లోనే అరికట్టాలని, వైరస్ సోకిన నారును ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు విక్రయించకూడదని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. ఉద్యాన పంటల నర్సరీలు నిర్వహించే రైతులు పంటలకు సంబంధించిన విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యమైన, ధ్రువీకరించిన బ్రాండ్ విత్తనాలను మాత్రమే తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి జి.అనసూయ, ఏడీఏలు శ్రీనివాసరెడ్డి, సరిత, ఉద్యాన అధికారులు సందీప్‌కుమార్, మీనాక్షి, నగేశ్, వేణు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా