రాబోయే తరాలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పెనుముప్పుగా మారనుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం నుంచి జమలాపురం వరకు సాగిన ర్యాలీని మంత్రి ప్రారంభించారు.
ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తే ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టవచ్చని పువ్వాడ అజయ్ తెలిపారు. ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలందరిలో అవగాహన కల్పించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: మేడారంలో అపశృతి.. మూర్ఛవ్యాధితో ఇద్దరి దుర్మరణం