ETV Bharat / state

Amit Shah Telangana Tour : ఈ నెల15న తెలంగాణకు అమిత్ షా - Amit shah Telangana tour on June 15th

Amit Shah
Amit Shah
author img

By

Published : Jun 6, 2023, 12:12 PM IST

Updated : Jun 6, 2023, 12:37 PM IST

12:09 June 06

ఈ నెల 15న రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Amit Shah Visits Telangana on June 15th : తెలంగాణలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలన్నీ రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల కోసం వ్యూహం రెడీ చేసుకుంటోంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంటే.. ఎలాగైనా ఈసారి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇక ఈ రెండు పార్టీలు గల్లీలో దుష్మన్.. దిల్లీలో దోస్తుల్లాగా ఉంటున్నాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ తెలంగాణ గద్దెపై తమ జెండా ఎగురవేయాలని చూస్తోంది.

Amit Shah Attends BJP Public Meeting in Khammam : ముఖ్యంగా బీజేపీ.. కేసీఆర్​ను ఎలాగైనా ఈ సారి గద్దె దించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వ్యూహం రచించింది. ఇందులో భాగంగా.. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ.. ఓటర్లను ఆకర్షించేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్రతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల్లోకి వెళ్లగా.. తాజాగా మహా జన సంపర్క్ అభియాన్ పేరిట మరోసారి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.

BJP Public Meeting in Khammam on June 15th : ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా మహాజనసంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణలోనూ ఈ పార్టీ నాయకులు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలకు.. మోదీ ఇన్నేళ్లలో చేసిన అభివృద్ధిని.. సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఆ సభలకు కేంద్ర మంత్రులను.. జాతీయ నాయకులను ఆహ్వానిస్తూ.. కేంద్రం కూడా రాష్ట్ర ప్రజలకు చేరువలోనే ఉంటుందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

JP Nadda Telangana tour on June 25th : ఈ క్రమంలోనే ఈ నెల 15వ తేదీన రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. అదే రోజున ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఖమ్మంలో తమ పార్టీ కేడర్​ను బలపరిచేందుకు.. కార్యకర్తల్లో జోష్​ను నింపేందుకే అమిత్ షా పర్యటన అని రాష్ట్ర నేతలు అంటున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణలో పర్యటించనున్నారని రాష్ట్ర నాయకత్వం తెలిపింది. ఈనెల 25న నడ్డా రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు వెల్లడించింది. అదే రోజున నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే సభలో నడ్డా పాల్గొననున్నారు.

Last Updated : Jun 6, 2023, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.