Lands to Poor People: బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మంకు చేరిన వాళ్లంతా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఏ దిక్కులేని వారంతా సర్కారు స్థలాల్లో గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. ఎలాంటి సదుపాయాలు లేకపోయినా ఏళ్ల తరబడి అక్కడే ఉంటూ.. కూలీనాలీ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. శ్రీనివాస్‌నగర్ కాల్వకట్టప్రాంతం, దోరన్ననగర్, రాజీవ్‌నగర్‌గుట్ట, సుల్తాన్‌నగర్‌తో పాటు అల్లీపురం, గొల్లగూడెం, ప్రకాశ్‌నగర్, రామచంద్రయ్యనగర్ వంటి ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో పర్యటించిన మంత్రి పువ్వాడ అజయ్ 2 వేల మందికి ఇళ్లపట్టాలు అందించారు.
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
దశాబ్దాలుగా ఇక్కడే ఉన్నా భూములకు పట్టాలు లేవనే బాధ ఉండేదని ప్రభుత్వసహకారంతో కష్టాలు తొలగిపోయాయని కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో విద్యుత్, నీటి సౌకర్యం లేక ఎన్నో కష్టాలు అనుభవించామని తెలిపారు. స్థలాలకు పట్టాలిచ్చిన సర్కారు ఇళ్లు కట్టుకునేందుకు సాయం అందించాలని కోరుతున్నారు. ఖమ్మంలో గజం స్థలం పదివేలకు తక్కువ లేదు. అంత విలువైన భూమిని ప్రభుత్వం అందించడంపై పేదల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఇదీ చదవండి: