ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరో వైపు వైద్యులను బదిలీ చేయడం సరికాదని అఖిల పక్ష పార్టీలు ఆరోపించాయి. మధిర ప్రభుత్వ ఆస్తత్రి ఎదుట నాయకులు ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఆస్పత్రిలో అసలే వైద్యుల కొరత కారణంగా ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదని ఆరోపించారు. ఈ సమయంలో ఉన్న ఇద్దరు వైద్యులను వేరే ప్రాంతానికి డిప్యుటేషన్‌పై బదిలీ చేయడం సరికాదని మండిపడ్డారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రజలకు వైద్య సేవలు అందే పరిస్థితి కొరవడిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం బదిలీలను నిలిపివేసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కిరాక్ మోసం: 4ఎకరాలు చూపి కోటికి టోపి, అరెస్టు