వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఓ సాధారణ గృహిణి జ్యోతి. ఖమ్మం నగర శివారు బాలపేటకు చెందిన జ్యోతి... న్యాయవాద విద్య అభ్యసించింది. తన కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా చేసుకొని పూలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తుందీ మహిళా రైతు.
ఐదేళ్ల క్రితం ఖమ్మం విడివోస్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం నిర్మించారు. ప్రతి అంతస్తులో మొక్కల సాగుకు ప్రత్యేకంగా కారిడార్ ఏర్పాటు చేశారు. పనికి రాని ప్లాస్టిక్ డబ్బాలు, బకెట్లు సేకరించి మొక్కలు పెంచుతోంది జ్యోతి. ఓ అంతస్తులో ఆకుకూరలు, ఇంకోదాంట్లో కూరగాయలు, మరో అంతస్తులో తీగజాతి సాగు చేస్తోంది. నాలుగో అంతస్తులో మొత్తం బొప్పాయి చెట్లనే పెంచుతున్నారు. ఒక్క ఆపిల్ తప్ప బయట తాము ఎలాంటి కూరగాయలు, పండ్లు కొనమని జ్యోతి చెబుతోంది.
పూర్తిగా పురుగు మందులతో పంటలు పండిస్తున్న ఈ రోజుల్లో... తన కుటుంబం కోసం సేంద్రియ పద్ధతిలో ఇంట్లోనే కూరగాయలు సాగు చేస్తూ... పలువురికి ఆదర్శంగా నిలుస్తోందీ మహిళా రైతు.
ఇవీ చూడండి:సేంద్రియం-ఆరోగ్యమంత్రం