ఖమ్మం జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట కార్మికులు అందోళన నిర్వహించారు. ఒప్పంద కార్మికుల ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో జిల్లా వ్యాప్తంగా కార్మికులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని హెచ్చరించారు.
ఇవీ చూడండి: సచివాలయ తరలింపు: భవనాల కోసం అన్వేషణ