కాసేపటికి బాలిక తల్లి ఇంటికొచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. అదే సమయంలో కోటిరెడ్డి ఇంటి నుంచి కుమార్తె కేకలు వినిపించటంతో అక్కడికి వెళ్లింది. బాలిక రోదిస్తూ జరిగినదంతా తల్లికి వివరించింది. ఆగ్రహించిన బాధితురాలి కుటుంబీకులు, గ్రామస్థులు కోటిరెడ్డిని చితకబాదారు. కోటిరెడ్డి ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవటంతో ఇంటిని ముట్టడించారు. బయటకు వచ్చిన అతనిపై దాడిచేసి కొట్టారు.
ఖమ్మం గ్రామీణం, రఘునాథపాలెం, కూసుమంచి ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన నిందితుని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముదిగొండ ఠాణాలో ఖమ్మం గ్రామీణ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ సీఐ అంజలి.. బాలిక, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి సంఘటన వివరాలను తెలుసుకున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కోటిరెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్‌కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: దారుణం: తాతయ్య, నానమ్మే చంపేశారు