ETV Bharat / state

పిల్లలు తోడు లేరనే మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య - ఉరివేసుకుని ఆత్మహత్య

వృద్ధాప్యంలో తమకు తోడుంటారని భావించి.. ఎన్నో కలలతో అల్లారుమద్దుగా పెంచిన తన పిల్లలు అనుకున్న సమయానికి తోడులేరు. దీనితో మనస్తాపానికి గురైన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

A man in Khammam committed suicide because his child was away
పిల్లలు తోడు లేరనే మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య
author img

By

Published : Apr 4, 2020, 1:44 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లిలో శ్రీలం బ్రహ్మానందరెడ్డి(55) అనే రైతు పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు అమెరికాలో, కూతురు చంఢీగడ్‌లో ఉన్నారని స్థానికులు తెలిపారు.

బ్రహ్మానందరెడ్డికి ఆర్థికంగానూ ఎలాంటి సమస్యలు లేవని.. పిల్లలు తనకు అందుబాటులో లేకుండా దూరంగా ఉన్నారనే మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. బ్రహ్మానందరెడ్డి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లలను తలుచుకుంటూ కొన్ని రోజులుగా మనో వేదనతో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

పిల్లలు తోడు లేరనే మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య

ఇదీ చూడండి: 'జమాత్​' బాస్​పై ఐటీ శాఖ గురి- త్వరలోనే ఉచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.