ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కృష్ణాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన 500 ట్రక్కుల ఇసుక డంప్‌ను... ఖమ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. కట్టలేరు వాగు వద్ద పెద్ద మొత్తంలో ఇసుక నిల్వ చేశారని స్థానికులు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేశారన్న సమాచారంతో దాడులు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ రవికుమార్ వెల్లడించారు. ఇసుక డంప్‌ను సీజ్ చేసి కేసును తల్లాడ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: శిశు సంక్షేమ శాఖకు మరిన్ని సంస్కరణలు: సత్యవతి రాఠోడ్