ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.
నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం నరసాయిపల్లికి చెందిన 15 మంది భద్రాచలంలో తమ చిన్నారికి పుట్టెంటుకలు తీయించేందుకు తుఫాన్ వాహనంలో బయలుదేరారు. నేలకొండపల్లికి చేరుకోగానే వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: పరిశీలనకు వెళ్లి.. యంత్రంలో పడి ఇంజినీర్ మృతి